నేటి సాక్షి నారాయణపేట, మే 8,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పశువైద్య శిబిరాన్ని మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నై ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మరికల్ పశువైద్య అధికారి మహదేవ్ మాట్లాడుతూ ప్రజా పాలన 99 లో భాగంగా పశువులకు గర్భకోశ చికిత్స శిబిరం ను ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. పశువులు ఉన్న రైతులకు కావలసిన మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పశువులకు వచ్చే వ్యాధుల నివారణపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. పశువైద్య శిబిరాలను మరికల్ మండలం లో ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మరికల్ పసి వైద్యాధికారి డాక్టర్ మహాదేవ్, జేవివో వాసుదేవుడు, వి ఏ కె నర్సింలు, గోపాల మిత్రులు శ్రీనివాస్ గౌడ్ భరత్ కుమార్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.





