నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 09 మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి సోదరుడు, టీడీపీ యువ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మిక మృతి చెందడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్త తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి వెంటనే మాధవరం గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే మంచి యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. శ్రీనివాస్‌రెడ్డి సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్‌రెడ్డికి నివాళులర్పించారు.





