*నేటిసాక్షి* మే 9 తిరుమలాయపాలెం (రుద్రరాజు)తిరుమలాయపాలెం: కాంగ్రెస్ పార్టీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడిగా కొప్పుల అశోక్ నియమితులవడం మండల ప్రజలకు గర్వకారణమని పలువురు ప్రజాప్రతినిధులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా అశోక్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటున్నారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని కొనియాడుతున్నారు. ప్రజా సేవలో చూపిన నిబద్ధత, పార్టీ పట్ల ఉన్న అంకితభావం కారణంగానే పార్టీ అధిష్టానం ఈ కీలక బాధ్యతను అప్పగించిందని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా పాలేరు శాసనసభ్యులు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే నూతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొప్పుల అశోక్‌కు మండల ప్రజలు, పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు మరింత సేవ అందిస్తానని కొప్పుల అశోక్ ఈ సందర్భంగా తెలిపారు.





