నేటిసాక్షి* మే 9 తిరుమలాయపాలెం (రుద్రరాజు) తిరుమలాయపాలెం మండలం ప్రజా దర్బార్ కార్యక్రమంలో తెట్టెలపాడు గ్రామానికి చెందిన కట్ట వీరయ్య అనే వృద్ధుడు ఎన్నో సంవత్సరాలుగా వాతము వ్యాధితో బాధపడుతున్నాడు పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా గానీ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజాదర్బార్ కార్యక్రమంలో స్వయంగా మంత్రి ని కలసి పింఛన్ కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తూ చివరకు గ్రామస్తుల సహాయంతో మంచంపై ప్రజా దర్బార్‌కు చేరుకున్న ఘటన హృదయ విదారకంగా మారింది.“మంత్రిగారు మమ్మల్ని రక్షించండి… మాకు మీరే దిక్కు” అంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వేడుకోవడంతో అక్కడి వాతావరణం భావోద్వేగానికి గురైందివృద్ధుడి పరిస్థితిని స్వయంగా పరిశీలించిన మంత్రి వెంటనే అధికారులను ఆదేశించి పింఛన్ మంజూరు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్య ప్రజా దర్బార్ వేదికగా పరిష్కారం దిశగా అడుగులు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు బిల్లగిరి ధనుంజయ్ సర్పంచి చిర్ర నర్సమ్మ ఉపసర్పంచ్ పంతంగి లక్ష్మీనారాయణ వార్డు సభ్యులు దొరికొండ వెంకటనారాయణ అంగడి నరేష్ పగిడిపల్లి బాబు పగిడిపల్లి సుమతి వంగూరి మధుబాబు వంగూరి రేణుక తదితరులు పాల్గొన్నారు





