,(నేటిసాక్షి ).. బుగ్గారం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో వచ్చిన సీసీ రోడ్డు పనులు శనివారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు నగునూరి నర్సాగౌడ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో మిగిలిన సీసీ రోడ్డులు అభివృద్ధి పనులు త్వరలోనే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పూర్తి అయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అయన వెంట మాజీ ఎంపిటిసి నగునూరి రామగౌడ్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జంగ శ్రీనివాస్,తాడేపు లింగన్న, వార్డు మెంబర్ జక్కుల లింగన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్న కాంగ్రెస్ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు.





