Sunday, May 10, 2026

*ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు-అమ్మకు నా అక్షర నీరాజనం**పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ – చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ:-సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు*

నేటి సాక్షి పాములపాడు (మే-10):- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు ప్రపంచ తల్లుల దినోత్సవం సందర్భంగా తన భార్య టేకూరి.రేణుక, కుమారులు టేకూరి.యువ, టేకూరి.కుందన్, బంధుమిత్రులతో కలిసి భారీ కేక్ ను కటింగ్ చేసి, తన తల్లి అయిన మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ కు తినిపించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజ సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ.. పేరులో ప్రేమని.. అమ్మ పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృత మూర్తి అమ్మ అని అన్నారు. అంత గొప్ప మానవత్వం ఉన్న అమ్మ, అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, అమ్మను ఎంత పొగిడినా తక్కువే అన్నారు. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుందనీ, అమ్మకు ప్రత్యామ్నాయం లేదనీ, అమ్మ ఉన్న చోట అదృష్టం పురి విప్పి ఆడుతుందన్నారు.ప్రతి ఒక్కరికి ‘‘అమ్మ లేకపోతే జననం లేదనీ, అమ్మ లేకపోతే గమనం లేదనీ, అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదనీ, అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే అమ్మకి ‘ మదర్స్ డే శుభాకాంక్షలు అన్నారు.‘‘కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే’’. ఓ మాతృ మూర్తి.. ‘మదర్స్ డే’ సందర్భంగా మీ కిదే మా వందనం అంటూ నినాదాలు చేశారు.పిల్లలు కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం, కుటుంబం కోసం అందర్నీ కనుపాపలుగా చూసుకుంటూ, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు…పాదాభివందనం చేస్తూ -హ్యపీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.అన్నం కలిపి గోరు ముద్దలు పెట్టేటప్పుడు తనకు బిడ్డపై ఉన్న ప్రేమను కూడా కలిపి తన పిల్లలకు పెడుతుందన్నారు. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ అమ్మ తయారుచేసిన ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుందన్నారు. అమ్మ – ఒక కావ్యం కల్మషం లేని నవ్వు – అమ్మ,నిర్మలమైన మమతల కోవెల అని- అమ్మ,కష్టాన్ని దాచుకుని, నవ్వును పంచే – అమ్మ,నా ప్రాణానికి ఊపిరి అని – నా అమ్మ!కంటిపాపలా కాపాడే కవచం అని, – అమ్మ,లోకం రుచి చూపిన మొదటి గురువు అని – అమ్మ, ఏడవడానికి అయినా, తలదాచుకోవడానికి అయినా,అమ్మ ఒడిని మించిన స్వర్గం లేదనీ అన్నారు.ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు పేరుపేరునా హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నాగేశ్వరరావు యువ సైన్యం, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News