( నేటి సాక్షి): ఒక వ్యక్తి ఇచ్చే రక్తం మూడు జీవితాలను కాపాడగలదని రక్తదాన శిబిర ఆర్గనైజర్ ఎల్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మధుసూదన్ రెడ్డి కూతురు సాన్వి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రేవతి హైస్కూల్ లో ప్రీమియర్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా యువకులు పాల్గొని రక్తదానం చేస్తున్నారని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో సేవా భావాన్ని పెంపొందించడమే కాకుండా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడుతుందని వెల్లడించారు.





