Tuesday, May 12, 2026

ప్రభుత్వ భూములు లో అక్రమంగా మట్టి తవ్వకాలు

నేటి సాక్షి అనంతగిరిప్రభుత్వ భూమి నుండి పొలాల్లోకి యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాల సమస్యగా మారుతోంది.ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండగా, ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది.వివరాలు వెళితే మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో సమీపంలోని ఊర చెరువు వద్ద ప్రభుత్వ భూమి ఉంది.కొందరు ప్రభుత్వ భూమిలో మట్టి పంట పొలాల్లోకి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ సూచనల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమంగా మట్టి తరలిస్తున్న దగ్గరికి వెళ్లి పరిశీలించగా అక్కడ జెసిబి ట్రాక్టర్లు ఉన్నాయి.అక్కడికి వెళ్లిన అధికారులు పట్టుకున్న వాహనాలను వదిలేశారు.పట్టుకున్న వాహనాలను అధికారులు వదిలేయడమేమిటని ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా ఇసుకను తరలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News