Wednesday, April 15, 2026

విద్యార్థుల కోసం..

  • బీసీ గురుకులానికి పేరెంట్ సాయం

నేటి సాక్షి, మొయినాబాద్: తన పిల్లలు చదువుతున్న బీసీ గురుకులానికి ఆ పేరెంట్​తనవంతు సాయం చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చూశారు. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో కంచం అంజయ్య పిల్లలు శివ ప్రసాద్, లాలు ప్రసాద్ చదువుతున్నారు. గురుకులానికి ఫ్యాన్లు అవసరం అని తెలుసుకొని, 50 ఫ్యాన్లు అందజేశారు. అంజయ్యను ఎంజేపీ గురుకుల సెక్రెటరీ సైదులు, ప్రిన్సిపాల్ జంగం నరేష్, సిబ్బంది అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ టీచర్ రాజేష్, పీడీ శ్రీనివాస్, దేవులపల్లి రమేశ్, రాథోడ్ మోహన్, కిరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News