Sunday, April 19, 2026

*అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి** మెట్‌పల్లిలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్‌కు ఘన స్వాగతం* మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర ఇంచార్జీ—*నేటి సాక్షి

– కోరుట్ల*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటనలు చేస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్‌కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు, శాలువాలతో ఆత్మీయంగా సత్కరించారు.*పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కారం*మెట్‌పల్లి పట్టణానికి వచ్చిన సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్‌ను పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించి పార్టీ శ్రేణులు గౌరవం తెలిపారు.—*పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం*అనంతరం మెట్‌పల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఇంచార్జీ అభయ్ పటేల్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీలు, పార్టీ ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.*ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవాలి*పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించాలని అభయ్ పటేల్ పిలుపునిచ్చారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలసి బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి పార్టీకి ఓటు వేసేలా కృషి చేయాలని సూచనలు, సలహాలు ఇచ్చారు.*ఎన్నికల విషయంలో కార్యకర్తల పాత్ర కీలకం*మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలంగా పనిచేయాలని, ఎన్నికల ఇంచార్జీలు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. కార్యకర్తల కృషితోనే బీజేపీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి బీజేపీ ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్, ఎన్నికల జోనల్ ఇంచార్జీలు, వార్డు ఇంచార్జీలు వడ్డేపల్లి శ్రీనివాస్, ఏలేటి నరేందర్ రెడ్డి, బద్దం గంగాధర్ రెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.—–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News