Monday, April 13, 2026

*ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందడుగు..**జగిత్యాలలో బీజేపీ నేత కొండా లక్ష్మణ్ వీస్తృత ప్రచారం*—————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)……………………………………కేంద్రంలో కొలువున్న బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోది నాయకత్వంలో దేశం ముందుండుగు వేస్తోందని జగిత్యాల బీజేపీ నేత కొండా లక్ష్మణ్ అన్నారు.జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, యువకులు మహిళలు తోడు రాగా బీజేపీ నేత కొండా లక్ష్మణ్ సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 26,44,48 వార్డులలో బీజేపీ అభ్యర్థుల తరఫున కొండా లక్ష్మణ్ ఇంటింటి ప్రచారం చేపట్టాగా ప్రజల్లో అపూర్వ స్పందన లభిస్తోంది.*ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ మాట్లాడుతూ*నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంఅభివృద్ధి పథంలో దుసుకుపోతుందన్నారు.మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని అందుకు బీజేపీ ని బలపర్చాలని కోరారు.పట్టణంలోని 50వార్డు లకు గాను 29 వార్డులు మహిళ లకు బీజేపీ టికెట్లు కేటాయించిందని లక్ష్మణ్ తెలిపారు.జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డులలో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నిధులు ద్వారానే అని గుర్తు చేశారు.బీజేపీ అభ్యర్థులు కౌన్సిల్ లో ఉండడం వలన అవినీతి ప్రక్షాళన జరుగుతుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధితొ పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అభ్యర్థులు పనిచేస్తారని కొండా లక్ష్మణ్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News