నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………. జగిత్యాల పట్టణంలోని 2వ వార్డులోని విజయపురి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ దయాల చంద్రకళ, సీడీపీఓ జయప్రదల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవుల దృష్ట్యా చిన్నారులకు 25 రోజులకు సరిపడా టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్)తో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లల బరువులు, ఎత్తులు పరిశీలించి పౌష్టికాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలింతలు పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం గురించి సీడీపీఓ జయప్రద వివరించారు.రక్తహీనత నివారణకు, తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు టీహెచ్ఆర్ ఎంతో ఉపయోగపడుతుందని సీడీపీఓ జయప్రద తెలిపారు. వేసవిలో పిల్లల ఆరోగ్యం దెబ్బతినకుండా పోషకాలు అందేలా ఈ చర్యలు తీసుకున్నట్లు కౌన్సిలర్ చంద్రకళ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ రాజశ్రీ,సూపర్వైజర్ కవితారాణి,అంగన్వాడీ టీచర్లు అరుణ, పద్మ, ఏఎన్ఎం మాదేషి శిరీషా, ఆయాలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.





