నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు …………………………………….తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక అవస్థలు పడ్డారని, కార్మికులు సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకల్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన మే డే వేడుకల్లో మంత్రి పాల్గొని జెండా ఆవిష్కరించారు. *ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ*తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల సింగరేణి కార్మికుల పోరాట ప్రటిమ మరువలేనిదని మంత్రి అన్నారు. నాడు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కనీసం చర్చలకు ఆహ్వానించలేదని మంత్రి అన్నారు.ప్రజలు మార్పు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తే కేవలం మూడు రోజుల్లోనే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐదుగురు మంత్రులు 24 సంఘాల ప్రతినిధులతో చర్చించి సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు.కార్మికుల న్యాయమైన పరిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఆర్ టి సి కార్మి కుల సంఘం గౌరవ అధ్యక్షులు శంకర్ తోపాటు ఆర్టీసీ కార్మికులు నాయకులు పాల్గొన్నారు.





