నేటి సాక్షి, మోత్కూర్.(సురేష్ మోత్కూర్.)మే డే సందర్భంగా మోత్కూరు గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం నందు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులను సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపేట రామకృష్ణ ధనేశ్వర్ ఘనంగా సన్మానించడం జరిగింది. కార్మికుల యొక్క శ్రమ వెలకట్టలేనిది కార్మికులను గుర్తించడానికి ఇదొకరోజు ఉందని గుర్తు చేశారు కొత్తపేట రామకృష్ణ ధనేశ్వర్. కారోబార్ పుల్ల అంజలయ్య, గ్రామ కార్మికులు దండు నరసమ్మ,సండే బాబు, డ్రైవర్ ఆంజనేయులు, వాటర్ మాన్ మల్లేశం, గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్ర సారంగి, గోపాల్, రాఘవేంద్ర రెడ్డి, కుమ్మరి కేశవులు, బైండ్ల చంద్రయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.





