Friday, May 1, 2026

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ.పాల్గొన్న సీపీఎం జిల్లా నాయకులు.

నేటి సాక్షి వికారాబాద్ :ప్రపంచ కార్మిక దినోత్సవo మే డే సందర్భంగా ఆర్ &బీ మున్సిపల్ ఆఫీసు,ఎన్టీఆర్ చౌరస్తా,ఐ సి డి ఎస్ ఆఫీస్,సిఐటియు ఆఫీస్, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వివిధ ఆఫీసుల వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ జిల్లా కమిటీ సభ్యులు సతీష్ మాట్లాడుతూ 140ఏండ్ల (సంవత్సరాల ) క్రితం పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను రైతాంగ హక్కులను మోడీ ప్రభుత్వం కలరాస్తుంది అని అన్నారు 8 గంటల పని దినం కొనసాగించాలి కేంద్ర బిజెపి సర్కార్ తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రైతులకు ఉచిత కరెంటు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రుణమాఫీ చేయాలి అని గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి కొరత లేకుండా ప్రజలకు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉచిత వైద్యం విద్య అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి అక్బర్ కిషన్ చందు గోపాల్ రాజు తదితరులు ఆర్ఎంబి నాయకులు మున్సిపల్ నాయకులు అంగన్వాడి ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు భారతి లక్ష్మ శంకర్ నాయక్ యాదయ్య రాజు షేకర్ శంకర్ బుచ్చిరెడ్డి ప్రవీణ్ ప్రసాద్ కుమార్ అనిల్ రావి తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News