నేటి సాక్షి, నారాయణపేట ఏప్రిల్ 25, ( రిపోర్టర్ ఇమామ్ సా బ్ ) నారాయణపేట జిల్లాలోని మరికల్ శ్రీవాణి హై స్కూల్ యాజమాన్యం సేవ కార్యక్రమం లో భాగంగా మరికల్ పట్టణ ప్రాంత విద్యార్థులకు విద్యా వినోదిని* అనే సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని శ్రీవాణి హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ పూర్ణిమ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….ఈ క్యాంపు ఎటువంటి ఫిసు లేకుండా 3వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల విద్యార్థులకు సేవ దృక్పధం తో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంపు లో స్పోకెన్ ఇంగ్లీష్(స్పోకెన్ ఇంగ్లీష్ ) మరియు లాంగ్వేజ్ స్కిల్స్ (లాంగ్వేజ్ స్కిల్స్ )* మీద తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 27 వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. సమయం*: ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మరికల్ అబయాంజనేయ స్వామి దేవాలయం నుండి ఉచిత బస్సు సౌకర్యం కూడా కలదు.బస్సు ప్రతీ రోజు ఉదయం 5 గంటల 30 నిముషాలకు బయలుదేరును.కాబట్టి అవకాశాన్ని విద్యార్థులకు తెలియచేసి అధిక సంఖ్యలో విద్యార్థులు ఉపయోగించుకునే విదంగా సమాచారం అందించగలరు.





