నేటి సాక్షి నారాయణపేట, ఏప్రిల్ 30 (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కిందని ఆయన వివరించారు. గృహనిర్మాణదారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్లతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాలనీవాసులు సాల్వలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెలగొంది ఈరన్న పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, రామన్ గౌడు, మరికల్ గ్రామ ఉపసర్పంచ్ కాజా, వార్డు సభ్యులు రాజేశ్వరి రఘు, లక్ష్మీ రఘు, ఇందిరమ్మ గృహ నిర్మాణదారులు బోయ పెద్ద బీరప్ప అంజమ్మ, నాయకులు తాటికొండ ఆంజనేయులు, రామ కృష్ణ, , ఆనంద్ కుమార్, నాగరాజు, రామకృష్ణారెడ్డి తదితరులు, పాల్గొన్నారు.





