నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………….రాజకీయ రంగంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడమే ధ్యేయంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ‘తెలంగాణ శక్తి అభియాన్’ ఉద్యమానికి గురువారం శ్రీకారం చుట్టింది. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య తన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించి కీలక ప్రకటన చేశారు.*ఈ సందర్భంగా నందయ్య మాట్లాడుతూ* “మహిళల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం అసంపూర్ణమన్నారు. ఇన్నాళ్లూ రాజకీయ పార్టీలు మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇకపై వారిని నిర్ణయాధికారం కలిగిన నాయకులుగా తీర్చిదిద్దుతుందన్నారు. అందుకే చట్టసభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ సాధించడమే ‘శక్తి అభియాన్’ ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఇది కేవలం నినాదం కాదని, కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.జిల్లాలోని చైతన్యవంతులైన మహిళలు, యువతులు ఈ చారిత్రక ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. “రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు, సామాజిక మార్పు కోరుకునే ఆడబిడ్డలు ముందుకు రావాలని నందయ్య కోరారు.జగిత్యాల జిల్లాలోని ప్రతి డివిజన్, ప్రతి బస్తీ నుంచి మహిళా గొంతుక వినిపించాలని సూచించారు.రాబోయే రోజుల్లో జగిత్యాల నుంచే మహిళా నాయకత్వానికి దిక్సూచి చూపిస్తాం” అని నందయ్య అన్నారు. ‘శక్తి అభియాన్’ జిల్లా కో-ఆర్డినేటర్ కృష్ణవేణి, సీనియర్ నేత సి.ఎస్. శివలాల్ నేతికర్ లు పాల్గొన్నారు. నలుగురు నేతలు ‘తెలంగాణ శక్తి అభియాన్‌లో చేరండి’ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించి, ఉద్యమ స్ఫూర్తిని చాటారు. ఈ ఉద్యమంలో చేరాలనుకునే మహిళలు, యువతులు కింది నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చనీ కృష్ణవేణి 83677 37373,-సి.ఎస్. శివలాల్ నేతికర్ 99664 82554,అలాగే http://www.shaktiabhiyan.in వెబ్‌సైట్‌లో కూడా నేరుగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.





