Thursday, April 30, 2026

హెడ్లైన్ : పెద్దకడబూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 30 పెద్దకడబూరు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో పెద్దకడబూరు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈసారి ఫలితాల్లో ధరణిధర్ రెడ్డి 581 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచి పాఠశాలకు గౌరవం తెచ్చారు. దాదా ఖలందర్, సులోచన తలో 570 మార్కులతో రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, యు.సంజన 566 మార్కులతో మూడో స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోరని మరోసారి నిరూపితమైంది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయానికి కారణమయ్యాయి.విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈఓలు) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల మొత్తం ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం పట్ల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ విజయంతో పాఠశాల ప్రతిష్ట మరింత పెరిగి, ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణగా నిలిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News