Thursday, April 30, 2026

హెడ్లైన్ : కోసిగిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 30 కోసిగి గ్రామంలోని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో డ్రైనేజీల శుభ్రత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలలో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యంత్రాల సహాయంతో శుభ్రం చేస్తున్నారు.వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు, దుర్వాసనలు, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, కాలువలను పూర్తిగా శుభ్రం చేయిస్తున్నారు.గ్రామ ప్రజలు కూడా పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకుని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని అధికారులు కోరారు. ఈ చర్యలతో గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News