నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఏప్రిల్ 20 ఓకే ఈతలో మూడు దూడలు జన్మించిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది .మండలంలోని దిగువపల్లి పంచాయతీ అప్పినపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం పాడి ఆవు ప్రసవ వేదన పడుతున్న సందర్భంగా రైతు పశువైద్యాధికారి పవన్ కుమార్ కు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన ఆయన సిబ్బంది రామచంద్ర కీర్తనలు గ్రామానికి చేరుకున్నారు .అనంతరం ఆవు మూడు కోడె దూడలకు జన్మనిచ్చింది. మూడు దూడలు చలాకీగా ఉన్నాయి జన్యుపరమైన లక్షణాల వల్ల పాడి ఆవుకు ఒకే ఈతలో మూడు దూడలు జన్మించినట్లు పశువైద్యాధికారి పవన్ కుమార్ తెలిపారు.





