Monday, April 20, 2026

** డిసిసిబి నూతన శాఖ ప్రారంభించిన. 👉స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డి

నేటి సాక్షి చిలుకూరు చిలుకూరు, మండల కేంద్రం చిలుకూరులో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అనుబంధంగా నూతన రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య శాఖను ఏర్పాటు చేశారు.శాఖను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిలుకూరు మండల కేంద్రంలో నూతన శాఖ ఏర్పాటు చేయడం వల్ల ఈ బ్యాంకు ద్వారాఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు లాభం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ బ్యాంకు ద్వారా లభించే రుణాలు ఇతర ఆర్థిక సేవలు నేరుగా రైతులకు దరి చేరడం వల్ల వారికి సాగు పనుల్లో వెసులుబాటు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బ్యాంకు ఉన్నతాధికారులు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News