నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………..మహాత్మా బసవేశ్వర గారి 893వ జయంతి సందర్భంగా ధరూర్ క్యాంప్ చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పుష్పాంజలి ఘటించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.*ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ*బసవేశ్వర గారు సమానత్వం, సామాజిక న్యాయం, శ్రమకు గౌరవం వంటి విలువలను సమాజానికి అందించిన మహానుభావుడని పేర్కొన్నారు. 12వ శతాబ్దంలోనే సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. అనుభవ మండపం ద్వారా ప్రజాస్వామ్యానికి పునాది వేసి, మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ఆయన చూపిన మార్గం నేటికీ ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.బసవేశ్వర గారి ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నందయ్య, కౌన్సిలర్లు జుంబర్తి గంగలక్ష్మి రాజ్‌కుమార్, మూలస్థం లావణ్య మహేష్, బైర్నీని భాగ్య, గోపి, సిరిపురం శ్రీలత శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ స్పందన, నాయకులు గాజుల రాజేందర్, బండ శంకర్, వీరశైవ సమాజ అధ్యక్షులు కంది కైలాసం మరియు అడ్డగూరి నాగేంద్ర, సూరం వీరయ్య, అంగడిమతం చరణ్ అయ్యవారు, గుంటి నిరంజన్, తదితరులు, వీరశైవ సభ్యులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.





