నేటి సాక్షి, తిమ్మాపూర్:ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్, దాని అనుబంధ గ్రామం గుండ్లచెరుపల్లె ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో శనివారం “బడి బాట” కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు నాణ్యమైన బోధన అందిస్తున్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య, తిమ్మాపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు గోగూరి అంజలి నర్సింహా రెడ్డి, నూనె సురేష్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, దాడి మొండి, రొడ్డ హరిత అనిల్, అవుల నర్సయ్య, కొండల్ రావు, స్వరూప కొండయ్య, అలువాల ప్రశాంత్, నాగ్మా నౌషీన్ నిసార్ తదితరులు పాల్గొన్నారు.





