Monday, April 20, 2026

*కలెక్టరేట్ లో ఘనంగా మహాత్మ బసవేశ్వరుని జయంతి వేడుకలు* *మహాత్మ బసవేశ్వరుని జయంతి సందర్భంగా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*—————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………సోమవారం కలెక్టరేట్‌లో తత్వవేత్త, సామాజిక సంస్కర్త మహాత్మ బసవేశ్వర (బసవన్న) జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ*12వ శతాబ్దపు తత్వవేత్తగా బసవేశ్వరుడు సమానత్వాన్ని బోధించారని, అనునభవ మంటపం స్థాపించారని అన్నారు. కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని అన్నారు. సమాజంలో అహింస ద్వారా సమాజానికి మంచి మార్గాన్ని ఎన్నుకొని జీవించేలా బసవేశ్వడు బోధనలు చేశాడని గుర్తు చేశారు. సమానత్వం, సత్యం, న్యాయం వంటి మహోన్నత విలువలను మన జీవన విధానంగా మార్చాలని బోధించిన మహానుభావుడు బసవన్న. అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నతంగా జీవించేవిధంగా బసవేశ్వరుడు బరోసా కల్పించాడన్నారు. సమాజ హితం కోసం పాటుబడిన బసవేశ్వరుడి మార్గం అందరికి ఆచరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి. ఎస్ లత, బి. రాజ గౌడ్, జిల్లా బి.సి వెల్ఫేర్ అధికారి జి. సునీత, జిల్లా స్థాయి అధికారులు, వివిధ స్థాయిల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News