Monday, May 4, 2026

కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బస్తాలు అందుబాటులో ఉంచాలి—– జిల్లా కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక.

నేటి సాక్షి నారాయణపేట మే 4, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),వరి కొనుగోలు కేంద్రాల లో అవసమైన్నని గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. కేంద్రాలలో వరి ధాన్యం తడిస్తే సంబంధిత అధికారిదే పూర్తి బాధ్యత అని ఆమె తేల్చి చెప్పారు. సోమవారం కలెక్టర్ మరికల్ మండలం తీలేర్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రానికి ఇంత వరకు ఎంత మంది. రైతులు ఎన్ని బస్తాల ధాన్యం తీసుకువచ్చారని, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని సీ.ఈవో ను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది రైతులు తమకు గన్ని బస్తాలు ఇవ్వలేదని, కేంద్రంలో గన్ని బస్తాలు ఎక్కువ ఉంచాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని ఆమె సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రంలో ధాన్యం తడిసి పోకుండా టార్ఫాలిన్లూ ఉంచుకోవాలన్నారు. తమకు ఇంతవరకు అధికారులు టార్ఫాలిన్లూ ఇవ్వలేదని, తామే ఇంటి నుంచి తీసుకువచ్చి సాయంత్రం ధ్యానం పై కప్పి వేస్తున్నామని కొందరు రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కేంద్రానికి సరిపడా టార్ఫాలిన్లను తెప్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News