Thursday, April 30, 2026

*డ్రగ్స్ నిర్మూలన, మహిళల మరియు పిల్లల భద్రత అందరి బాధ్యత : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్**ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల, బాలల భద్రత పై అవగాహన కార్యక్రమలు*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ మరియు ఈగిల్ టీమ్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా “చైల్డ్ సేఫ్టీ & సే నో టు డ్రగ్స్” కార్యక్రమాన్ని వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.*ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ*ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 5వ అంశమైన పిల్లల భద్రత మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో పోలీసు సిబ్బంది ప్రత్యక్షంగా వెళ్లి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబం మరియు సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం ఉందని అన్నారు. గంజాయి సరఫరా మరియు వినియోగంపై ఇప్పటికే పోలీస్ శాఖ కఠిన నిఘా ఉంచిందని, గతంలో గంజాయి కేసుల్లో ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. డ్రగ్స్ వినియోగించే వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా వారిని సరికొత్త మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.మహిళలు మరియు పిల్లల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News