-నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………….. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన నిధులు త్వరలోనే మంజూరు చేస్తామని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ధరూర్ క్యాంపులోని సర్వే నెంబర్ 218లో కాంగ్రెస్ కార్యాలయానికి ఎకరం స్థలం ఇప్పటికే కేటాయించారని, కార్యాలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్య పీసీసీ అధ్యక్షుడిని కోరారు. దీనిపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్, ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థలం ఎంపిక పూర్తయినందున జగిత్యాలలో కార్యాలయ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్య, పీసీసీ సెక్రటరీ బండ శంకర్, పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గుంటి జగదీశ్వర్, పీసీసీ సేవాదళ్ సెక్రటరీ ముకేశ్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.





