Wednesday, May 6, 2026

**చిలుకూరులో రోడ్డు ప్రమాదం** బస్సు-బైక్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం.. ఉండడంతో కోదాడ ఆస్పత్రికి తరలింపు

నేటి సాక్షి, చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని సీతారాంపురం స్టేజి వద్దఘోర రోడ్డు ప్రమాదం సీతారాంపురం స్టేజి వద్ద కోదాడ జడ్చర్ల జాతీయ రహదారి. ఎక్కుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది కోదాడ నుండి మిర్యాలగూడ వెళ్తున్న .ఆర్టీసీ బస్సు బైక్ను బలంగా ఢీకొట్టడంతో బైక్ మీద ప్రయాణిస్తున్న నారాయణపురం గ్రామానికి చెందిన పిల్లుట్ల నాగరాజు అనే వ్యక్తికి. తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, బాధితుడికి రక్తస్రావం కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది గాయపడిన అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News