-నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడం మంచి పరిణామని తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చిర్ర సతీష్ కుమార్ జగిత్యాలలో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిధానం చేసుకున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించారని, అప్పడు 589 మందిని గుర్తించి వారికి ₹ 10 లక్షల ఏక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఉద్యోగాలను సైతం ఇచ్చిందని సతీష్ కుమార్ గుర్తు చేశారు.మిగిలిన కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకుంటామని,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసే దిశలో అడుగులు వేస్తూ సీనియర్ నేతలైన కేశవ రావు చైర్మన్ గా,మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రోపేషర్ కోదండరాం,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ సభ్యులతో ప్రభుత్వం ఒక కమిటీని వేయడం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు.ఈ కమిటీ ఆధ్వర్యంలో అమర వీరుల కుటుంబాలు, ఉద్యమ కారుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.





