నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 18, (రిపోర్టర్ ఇమామ్ సాబ్),ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ఆదేశాల మేరకునూతన 33 కెవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంను నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం విఠలాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని నారాయణపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ రాంపురం శివారెడ్డి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యుత్ శాఖ సిబ్బంది ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





