నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 2 ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు పర్మిట్లు తప్పనిసరిగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ అన్నారు, ఈ మేరకు పుంగనూరు చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు, వాహన తనిఖీలు చేశారు .చౌడేపల్లి అనంతరాయన చెరువు వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన పర్మిట్ లేని వాహనానికి జరిమానా విధించారు .అంతర రాష్ట్రంలో తిరిగే లారీలు బస్సులు ఈచర్లు వంటివి తప్పనిసరిగా పర్మిట్లు కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా బోయకొండకు వచ్చే వాహనాలు సైతం పరిమితులు లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో సిబ్బంది పాల్గొన్నారు,





