Monday, May 4, 2026

పోక్సో కేసులో ఒకరికి 20 ఏండ్ల జైలు శిక్ష

నేటిసాక్షీ మే 04 (మంచిర్యాల) శ్రీధర్ దమ్మ బెల్లంపల్లి. ఆరెండ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు చేసిన నేరం రుజువై పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్షకు గురయ్యాడు. రూ. 10 వేలు జరిమానా,బాధితురాలికి రూ.200000 లక్షల పరిహారం డీఎల్ఎస్ ద్వారా ఇవ్వాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు కు చెందిన బండ సాయికృష్ణ 2020 తేదీ 21న మధ్యాహ్నం తన పిల్లలతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చిన మైనర్ బాలికను ఇంట్లోకి తీసుకువెళ్ళి గదిలో అసభ్యకరంగా ప్రవర్తించాడు.సదరు బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లి బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఇన్స్పెక్టర్ బి.రాజు కేసు నమోదు చేశారు. మంచిర్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి కోర్టు కేసు విచారణ చేసింది. లాల్ సింగ్, శ్రీనివాస్ నాయక్ ఇరువురి వాదనలు జడ్జి విన్నారు. ముద్దాయి ఫై నేరం రుజువు కావడoతో జడ్జి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.2,00000 లక్షలు కాంపెన్సేషన్ ఇప్పించాలని DLSA ను ఆదేశించారనీ బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్ రావు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News