Sunday, April 19, 2026

*ప్రజల సమస్యలపై ప్రత్యక్ష విచారణ*——–* గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుల పరిశీలన.. బాధితులకు న్యాయం చేయాలి – ఎస్పీ అశోక్ కుమార్* జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల అర్జీల స్వీకరణ14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడిన ఎస్పీసత్వర చర్యలకు అధికారులకు ఆదేశాలు—–*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.*ప్రజల సమస్యలపై ప్రత్యక్ష విచారణ*ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుల స్వరూపాన్ని అర్థం చేసుకుని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.*త్వరిత స్పందనతో న్యాయం లక్ష్యం*ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.—

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News