Thursday, April 23, 2026

ప్రభుత్వ భూముల దోపిడీపై పోలీసుల ఉక్కుపాదంములుగులో అక్రమ గ్రావెల్ మాఫియాపై మెరుపుదాడి – 6 మంది అరెస్ట్, 6 టిప్పర్లు, హిటాచీ సీజ్

నేటి సాక్షి గజ్వేల్ :–ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ములుగు మండలం కొక్కొండ గ్రామ పరిధిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందం, ములుగు పోలీసులతో కలిసి శనివారం తెల్లవారుజామున మెరుపుదాడి నిర్వహించింది.నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రభుత్వ భూమి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మోరాన్ని తవ్వి తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో అక్రమ రవాణాకు వినియోగిస్తున్న 6 టిప్పర్ లారీలు, తవ్వకాలకు ఉపయోగిస్తున్న టాటా హిటాచీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల చెరలో పడిన నిందితులు: గంట ఇంద్రసేన (మామిడ్యాల), దర్శనం కరుణాకర్ (ములుగు), రాజేందర్ పాశ్వాన్ (జార్ఖండ్ స్వస్థలం), సల్లూరి మల్లికార్జున్, కుంటబోయిన వీరేశం (బంగ్లావెంకటాపూర్), కర్రె దినేష్ (గజ్వేల్)గా గుర్తించారు.ఈ ముఠా కొంతకాలంగా ప్రభుత్వ భూమిని లక్ష్యంగా చేసుకుని అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న టిప్పర్ వాహనాల నెంబర్లు: TS 07 UB 8343, TS 36 T 3711, TS 36 T 5698, TS 08 UG 4245, TS 36 T 6304, TG 12 T 1988.ప్రభుత్వ ఆస్తులను దోచుకునే ప్రయత్నం చేసే వారిపై ఎలాంటి ఉపశమనం ఉండదని ములుగు ఎస్ఐ రఘుపతి స్పష్టం చేశారు. అక్రమ తవ్వకాలు, ఖనిజ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News