Sunday, May 3, 2026

*ఫార్మర్స్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.**ఫార్మర్ రిజిస్ట్రేషన్ 100% పూర్తి చేయాలి*——————————————–

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………….. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణ రావు ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంపై ప్రత్యేకంగా మే 04వ తేదీ నుండి చేపట్టనున్న “ఫార్మర్స్ వీక్” అమలు అంశంపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.*ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ*రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ద్వారా రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయని, దీని ద్వారా భవిష్యత్తులో అమలు చేసే అన్ని పథకాలను నేరుగా రైతులకు చేరవేయడం సులభమవుతుందని పేర్కొన్నారు.జిల్లాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేసి జూన్ 2వ తేదీ లోగా 100 శాతం నమోదు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులందరూ నమోదు అయ్యేలా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఫార్మర్స్ వీక్ కార్యక్రమాన్ని కేవలం ఆచరణాత్మకంగా కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలని, ప్రతి రోజు నిర్వహించే కార్యక్రమం రైతుల సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలని అన్నారు.సహజ వ్యవసాయం, పంటల విభిన్నీకరణ, ఉద్యాన పంటల విస్తరణ, ఆయిల్ పామ్ సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, రుణాలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.అలాగే మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించి, ఉత్పత్తులకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు) మరింత బలోపేతం కావాలని, వాటి ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఫార్మర్స్ వీక్ సందర్భంగా చేపట్టే ప్రతి కార్యక్రమం క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు ఇవ్వాలని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.*ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ*రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపారు. రైతులకు నీటి వనరులు సమృద్ధిగా అందేలా నీటిపారుదల శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఫార్మర్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువలు, ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని, నీటి వృథాను నివారించి సమర్థవంతమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు సమయానికి అందేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని తెలిపారు.చెరువుల్లో కలుపు మొక్కలు, కంపచెట్లు తొలగించడం, కాలువల పరిశుభ్రత, గేట్ల నిర్వహణ వంటి పనులను ప్రాధాన్యంగా తీసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించాలని సూచించారు.రైతులు నీటి కొరతను ఎదుర్కోకుండా ఉండేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, అందుకు అన్ని జిల్లాల అధికారులు కృషి చేయాలని తెలిపారు.ఫార్మర్స్ వీక్ సందర్భంగా చేపట్టే కార్యక్రమాలు రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరేలా ఉండాలని, ప్రతి కార్యక్రమం ఫలితాన్ని క్షేత్రస్థాయిలో చూపించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి వినియోగంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.*ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మాట్లాడుతూ* ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మే 4వ తేదీ నుండి ఫార్మర్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇకనుండి ప్రతివారం దీనిపైన సమీక్ష జరుగుతుందని, అందువల్ల ఫార్మర్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని తద్వారా భవిష్యత్తులో జరిగే లబ్ధి రైతులకు నేరుగా జరిగే అవకాశం ఉందని అందుకోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ జూన్ రెండవ తేదీ వరకు పూర్తి చేయాలని అందుకు అనుగుణంగా జిల్లా వారీగా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుందని ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయని ఇందులో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.మే 4వ తేదీ నుండి 09వ తేదీ వరకు నిర్వహించనున్న “ఫార్మర్స్ వీక్” సందర్భంగా అన్ని రకాల కార్యక్రమాలు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని సూచించారు.ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం, సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రతి కార్యక్రమాన్ని నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం పూర్తి చేయాలని, పనితీరును నిరంతరం సమీక్షించాలని సూచించారు.*ఈ సందర్భంగా మే 4నుండి 09 వరకు “ఫార్మర్స్ వీక్” నిర్వహణలో భాగంగా సంబంధిత శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు**వాటిలో ముఖ్యంగా :**04.05.2026 సోమవారం* నీల ఆరోగ్య పరిరక్షణ సమతుల్య ఎరువల యాజమాన్యం ప్రకృతి వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగు.*05.05.2026 మంగళవారం* ఉద్యాన పంటల సాగు ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదల ప్రత్యామ్నాయపంటల సాగు.*06.05.2026 బుధవారం* బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు సహకార సంఘాలు – ఎఫ్.పి.ఓల ద్వారా రైతులకు సేవలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు.*07.05.2026 గురువారం* వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు – పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ – డ్రోన్స్.*08.05.2026 శుక్రవారం* పశు సంవర్ధక శాఖ మరియు పాడి పరిశ్రమ – పశు జాతి అభివృద్ధి – దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు – వేసవిలో పశు సంరక్షణ మత్స్యశాఖ – చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ మరియు అధికోత్పత్తికి చర్యలు నీటిపారుదల శాఖ – సమర్థ నీటి విడుదల కొరకై గేట్ల నిర్వాహన మరియు ఎత్తిపోతల పథకాల మరమ్మత్తులు కాలువలలో కంపచెట్లు మరియు గుర్రపు డెక్క తొలగింపు.*09.05.2026 శనివారం* నీటిపారుదల శాఖ – చెరువులలో కంప చెట్లు మరియు గుర్రపు డెక్క తొలగింపు – సమతుల్య నీటి వినియోగం కార్యాలయాల పరిశుభ్రత.రేపు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని ఎందుకు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులందరూ సమన్వయం చేసుకోవాలని సూచించారు అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ విజయవంతంగా నిర్వహించాలని దీంతో పాటు అన్ని జిల్లాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని రెడ్ క్రాస్ లో మెంబర్షిప్ వేగవంతం చేయాలని మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలకు అనుగుణంగా పనులు కనిపించాలని ఇక నుండి డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక పోరాటాల్లో అప్లోడ్ చేసి నిర్వహించాలని సూచించారు అలాగే జనగణన భాగంగా లక్ష్యాలకు అనుగుణంగా జన గణన వేగవంతం చేయాలని అలాగే రాష్ట్రంలో నిర్వహించబోయే నీట్ ఎగ్జాం దృష్ట్యా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.అంతకుముందు వివిధ శాఖల ఉన్నత అధికారులు మరియు కలెక్టర్ల నుండి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల గురించి, వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిన అంశాల గురించి మరియు చేపట్టబోయే ఫార్మర్స్ వీక్ ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు బి. ఎస్ లత, బి. రాజ గౌడ్ , సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News