Monday, May 4, 2026

వార్షిక మహాసభ

నేటి సాక్షి, తిమ్మాపూర్:కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూర్ లో సోమవారం ఉదయం 11గంటలకు శ్రీ భవాని మహిళా పొదుపు సహకార సంఘ మొదటి వార్షిక మహాసభ అధ్యక్షులు చౌదరి దేవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, పొదుపు సంఘం 25 మార్చి 2025న 125మంది సభ్యులతో ప్రారంభమై, నేటికి 314మంది సభ్యులు ఐదు లక్షల నిధులతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గ ఎన్నికలు జరగ్గా, అధ్యక్షులుగా చౌదరి దేవేంద్ర, ఉపాధ్యక్షులుగా సిరిసిల్ల స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పో సమితి అధ్యక్షులు తోడెంగ రజిత, ఘనకులు చింతల విజయలక్ష్మి, బొజ్జ శ్రీలత, గట్టుదుద్దెనపల్లి-1 అధ్యక్షులు మడ్డి రజిత, గట్టుదుద్దెనపల్లి-2 సంఘ అధ్యక్షులు పిట్టల లత, శ్రీ ఆంజనేయ పురుషుల పొదుపు సహకార సంఘ అధ్యక్షులు చౌదరి పరశురాములు, సంఘ పాలకవర్గం, గుడిపాటి సరోజ, సింగం సాగరిక, పుట్ట పద్మ, బుర్ర రాణి, పంబాల స్వప్న, వేల్పుల మౌనిక, ఆగునూరి స్వప్న, పల్లె కవిత, పంబాల సరిత, ఓల్లే శ్రీలత, సంఘ ఘనకులు సిరిసిల్ల రేణుక తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News