Monday, May 4, 2026

*10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరచిన వేంపెంట జడ్పీ హైస్కూల్ విద్యార్థులను ఘనంగా సన్మానించి, అభినందించిన అంతర్జాతీయ సమాజ సేవకుడు సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు*

నేటి సాక్షి 04 పాములపాడు(మే-4):-పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో ఇటీవల జరిగిన 10 వ తరగతి ఫలితాలలో అత్యంత ప్రతిభ కనపబరిచిన ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ సమాజ సేవకుడు & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు అభినందిస్తూ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మండలంలో మొదటి స్థానం & జిల్లాలో మూడవ స్థానం సాధించిన వేంపెంట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు బోనపల్లె భాను ప్రకాశ్ (592 మార్కులు)ను, రెండవ స్థానం సాధించిన శివ నాయక్(576 మార్కులు), మూడవ స్థానం సాధించిన మాడుగుల జోష్ (564 మార్కులు) సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సింగపూర్ స్పెషల్ గిఫ్ట్, నగదు బహుమతులు, తీపి గుర్తులుగా స్వీట్ బాక్స్ లు ఇచ్చి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. మరియు మంచి ప్రోత్సాహం అందించినందుకు విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి, ఘనంగా సన్మానించడం చేయించడం జరిగింది. అనంతరం అంతర్జాతీయ సమాజ సేవకుడు & అందరివాడు మన ప్రియతమ గొప్ప సామాజికవేత్త డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత దేశానికి పౌరులు అని వారందరికీ మనమందరము సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మన భారత రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం లను ఆదర్శంగా తీసుకొని పేదరికం నుండి కష్టపడి చదివి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలుగా, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి, మరిన్ని ఘనతలు సాధించాలని మీకు అండగా నేను ఉంటానని ధైర్యంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఆయన విద్యార్థులకు మంచి విద్యాబోధన చేసి, మంచి మార్కులు రావడానికి కృషిచేసిన వేంపెంట ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం- ఎం.రఫీక్ అహ్మద్ కు, ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి, పేరుపేరునా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ,బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, ముద్దపాటి ప్రసాద్, వేమా రెడ్డి, నెంబర్ లక్ష్మన్న, కిరణ్, ఎర్రసాని రాము, చిన్నస్వామి ఆచారి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News