నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 25 పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబలం గ్రామానికి చెందిన మంగలి గాజలింగ ప్రమాదవశాత్తు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి స్పందించి మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయం ప్రకటించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి నగదు అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక మండలి సభ్యులు ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ బి. రామ్మోహన్ రెడ్డి, బూత్ కన్వీనర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ సాయం అందించారు.రైతు విభాగం అధ్యక్షులు కేపీ యల్లప్ప, మండల కార్యదర్శి చెవుల లక్ష్మన్న ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు నగదు అందజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పేదల కష్టాల్లో పాలుపంచుకోవడమే పార్టీ లక్ష్యమని నేతలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సోమప్పదని, లింగన్న గౌడ్, మదిరి రాముడు, ముస్లిం వలి భాషా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు హరిజన బొడ్డన్న, బీసీ సెల్ అధ్యక్షుడు బోయ చిన్న కడబూరి, కందనాతి మహాదేవ, గోసిలి చిన్న మహాదేవ, పోతురాజు నాగరాజు, బోయ భాస్కర్, వాలంటీర్స్ విభాగం అధ్యక్షుడు కమ్మరి నరసింహ ఆచారి, తెలుగు రాజు, ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షుడు కమ్మరి బ్రహ్మయ్య, బుడజగ్గుల సునీల్ తదితరులు పాల్గొని మృతునికి నివాళులర్పించారు.





