Sunday, April 26, 2026

హెడ్లైన్ : సీఎస్ఐ నూతన ఆలయ ప్రతిష్టకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఆహ్వానం

నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 25 పెద్దకడబూరు మండల కేంద్రంలో మే నెల 4, 5, 6 తేదీలలో నిర్వహించనున్న సీఎస్ఐ నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డిని స్థానిక సంఘ కాపరి ముత్తు మనోహర్ బాబు, సంఘ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు వివరించి, మూడు రోజుల పాటు జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. మండల కేంద్రంలో జరుగుతున్న ఈ ప్రతిష్ట మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడమే కాకుండా ప్రాంతీయ ఐక్యతను కూడా బలోపేతం చేస్తుందని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కార్యక్రమానికి హాజరై ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News