- ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాక ఆవిష్కరణ
- 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు
మెదక్ జిల్లా, నేటి సాక్షి (భూమయ్య) : ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, తదుపరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలందించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి ప్రశంషా పత్రాలు అందచేయుట తరువాత ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు పరిశీలన, అసెట్స్ పంపిణీ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆయన సూచించారు. మినిట్ టూ మినిట్ కార్యక్రమం సజావుగా జరిగేలా అనౌన్స్ మెంట్ చేయాలని చెప్పారు. అథితులకు ఏర్పాటు చేయు సీటింగ్ లో సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.





