నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 28అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని అబిష్ట మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం, వాహనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని అలంకరించిన తేరు పై గ్రామ వీధులలో భక్తి శ్రద్ధల మధ్య ఊరేగించారు.రంగురంగుల పుష్పాలతో సింగారించిన స్వామివారు తేరు పై దర్శనమివ్వగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులు సమర్పించారు. మంగళవాయిద్యాలు, భజనల మధ్య ఊరేగింపు కొనసాగి, గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.సకల ఏర్పాట్ల మధ్య నిర్వహించిన ఈ తేరు ఊరేగింపు విజయవంతంగా ముగిసింది.





