- దయానంద స్వామి వారి 104వ జయంతి
నేటి సాక్షి, బెజ్జంకి: మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో గల శ్రీ ధ్యాన నిష్టాశ్రమంలో గురువారం 66వ వార్షికోత్సవం మరియు దయానంద స్వామి వారి 104వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామి వారి శ్వేత శిలా విగ్రహానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమం ప్రతి మాఘ పాడ్యమి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఉపనిషత్ సామూహిక పారాయణం నిర్వహించబడింది. కోరుట్ల నుండి విచ్చేసిన జగదీశ్వరానంద స్వామి మరియు శుద్ధ బ్రహ్మానంద స్వామి ప్రవచనాలు అందించారు. తదనంతరం అన్నదానం నిర్వహించబడింది.స్థానిక భక్తులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ధ్యాననిష్టాశ్రమా ట్రస్ట్ చైర్మన్ అన్నాడి శ్రీనివాసరెడ్డి, ట్రస్టు సభ్యులు సభ్యులు పులి శ్రీనివాస్, కాచం వెంకటేశం, అన్నాడి రాంరెడ్డి, అన్నాడి తిరుపతిరెడ్డి, అరుకొంతం మల్లారెడ్డి, దోరగొల్ల అరేటి తదితరులు పాల్గొన్నారు.





