- చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
తేదీ 21.3.2025 శుక్రవారం రోజున ఎలిగేటి ఉపేందర్ సంఘ పర్సన్ ఇంచార్జ్ అధ్యక్షతన హుజురాబాద్ చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం 71 వ వార్షిక 83 వ మహాసభలో తేదీ1.4.2024 నుండి 31.12.2024 వరకు 9 మాసముల ఉత్పత్తి విక్రయాల వివరాల ‘జి’ స్టేట్ మెంట్ హెచ్.టి.ఐలు, 2025-26 సంవత్సర అంచనా బడ్జెట్, 2023-24 సంవత్సర ఆడిట్ బ్యాలెన్స్ షీట్ సంఘ సంక్షేమ తీర్మానాలు (14) సంఘ అసిస్టెంట్ మేనేజర్ చదివి వినిపించగా హర్షాతి పూర్వకముగా ఆమోదించినారు. ఈ సందర్భంగా సంఘ పర్సన్ ఇంచార్జి ఎలిగేటి ఉపేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గూర్చి సభ్యుల సంక్షేమం గూర్చి కృషి చేయుచున్నామని తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో నేత పారిశ్రామికులకు లబ్ధి చేకూరుచున్నదని చేనేత మిత్ర పథకం మరియు యారన్ సబ్సిడీ సబ్సిడీ డబ్బు విడుదల చేయాలని కోరుచూ నేత పారశ్రామికుల సంక్షేమం కొరకు కృషి చేయుచున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, చేనేత శాఖ టి. నాగేశ్వరరావుకి మరియు పథకములు అమలు చేయుచున్న డిపార్ట్మెంట్, టెస్కో అధికారులకు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు వేముల యాదగిరి, గుండేటి మహాదేవ్, మంచికట్ల వెంకటయ్య, మండల సత్యనారాయణ, కుడికాల ప్రభాకర్, మంచికట్ల సుమలత, మంచికట్ల వాణి లు మరియు సంఘ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.





