నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరవరం మండలం కేంద్రం లో మంగళవారం రోజున గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర బోనాలు నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పులతో యువతీ యువకులు నృత్యాలు చేస్తూ శివసత్తుల పూనకాలతో రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని పట్నాలు, ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి ఒడిబియ్యం పోసి పాడి పంటలతో పిల్ల పాపలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా ఎస్సై ఎల్లయ్య గౌడ సంఘం సభ్యులు కులస్తులు పాల్గొన్నారు.

