Friday, March 13, 2026

భూభారతిచట్టం ద్వారా… రైతులకు మేలు యాదయ్య


—– రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం
—– మహేశ్వరం నియోజకవర్గ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య
—— కాంగ్రెస్ తీసుకువచ్చిన భూభారతి రెవెన్యూ చట్టం 2025 తో రైతులకు మేలు

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గము మహేశ్వరం మండలం లో భూభారతి రెవెన్యూ చట్టం సదస్సు కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ తాసిల్దార్ నవత ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన
మహేశ్వరం నియోజకవర్గంమార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
సిహెచ్ యాదయ్య మాట్లాడుతూ మహేశ్వరం (పోరండ్ల గ్రామం): మరియు రావిరాల గ్రామంలో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి రెవెన్యూ చట్టం 2025 తీసుకువచ్చిందని, ఇందులో భాగంగానే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతు భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తెలియజేశారు. మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామం లో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఈ సందర్భంగా అధికారులు పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన చట్టాన్ని తీసుకువచ్చిందని. చాలాకాలంగా రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూముల సమస్యలు ఉదాహరణకు పట్టాదారు పాసుపుస్తకంలో పేర్లు తప్పుగా నమోదు కావడం, భూ విస్తీర్ణంలో తప్పుగా నమోదు కావడం లాంటి సమస్యలతో పాటు మరెన్నో పరిష్కరించేందుకు నూతన చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. రెవెన్యూ సదస్సులలో భూమి సంబంధిత సమస్యల ఆర్జీలను తీసుకుని అధికారులు అక్కడే పరిశీలించి పరిష్కరిస్తారని . రెవిన్యూ సదస్సులను రైతులు భూ యజమానులు ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యులు మదిలాపురం పాండు పోరండ్ల గ్రామ ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షులు,బుడుగు రాఘవేందర్ గ్రామ శాఖ అధ్యక్షులు,తావేటి పాపయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,పెంజార్ల యాదయ్య,మహేశ్వరం మండలం ఎస్సి సెల్ జనరల్ సెక్రెటరీ,సర్వగంటి రాజు పంచాయతి సెక్రటరీ,అల్వాల మల్లేష్ ఇంద్రము కమిటీ మెంబర్,మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది,
డిప్యూటీ తాసిల్దార్ నవత, ఆర్ ఐ స్వర్ణకుమారి, ,తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News