నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 16, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ లోని జీవీక్ ఈఎంఆర్ ఐ 108 అంబులెన్స్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.గుండెపోటు వచ్చినప్పుడు తక్షణ సహాయం అందించడానికి సిపిఆర్ విధానం ఎలా చేయాలి, అలాగే దాని ప్రాముఖ్యత ఏంటో గురించి ఈ ఏంటీ భరత్ కుమార్ విద్యార్థులకు వివరణాత్మకంగా వివరించారు.ఈ కార్యక్రమంలో 108 నారాయణపేట జిల్లా మేనేజర్ సి.రాఘవేంద్ర గారు,జూనియర్ కాలేజి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారు అంజనేయుయిల్ గారు, స్కూల్ సిబ్బంది సభ్యులు, పైలట్లు ఆనంద్, రాజు మరియు ఈ ఏంటీ భీంరెడ్డి లక్ష్మీ నారాయణ, పాల్గొన్నారు.




