నేటిసాక్షి ప్రతినిధి సిరిసిల్ల:69వ ఎస్ జి ఎఫ్ (SGF( ఉమ్మడి కరీంనగర్ జిల్లా కబడ్డీ క్రీడా పోటీలలో కుసుమరామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, సిరిసిల్ల విద్యార్థి జే సంతోష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు భద్రాది కొత్తగూడెం లో వచ్చే నెలలో జరుగుతాయి. ఇట్టి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయలు, విద్యార్థిని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





