నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మండలం అయిలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా స్థాయి తనిఖీ బృందం (DLIT) సందర్శించింది. ఈ సందర్భంగా నోడల్ అధికారి రాజేందర్ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించి, పాఠ్యాంశాల అవగాహన స్థాయిని పరిశీలించారు.*క్షుణ్ణంగా అధ్యయనం*ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, లెసన్ ప్లాన్లు, విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన రికార్డులను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు, పాఠశాల పరిసరాల శుభ్రతను కూడా పరిశీలించారు.విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు పలు సూచనలు చేసిన జిల్లా బృందం, బోధనలో నాణ్యత పెంచే చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగ్గా ఉండేలా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని పేర్కొంది.____





