*నేటిసాక్షి* మే 14 తిరుమలాయపాలెం(రుద్రరాజు)పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందించేందుకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ అన్నారు. పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సమస్యల ద్యేయంగా ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాలలో ఒక్కొక్క మండలంలో మూడు సెక్టార్లుగా విభజించి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర జిల్లా మండల స్థాయి అధికారులను ఒకే వేదికపై ప్రజల వద్దకు పాలన అనే విధంగా సమస్యలను తెలుసుకొని వారి పరిష్కరించేందుకు ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని ఆయన తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలో ఇప్పటివరకు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు 810 మంజూరు కాగా దాదాపు నిర్మాణం పూర్తిచేసుకుని ఇప్పటికీ 26 కోట్ల పైగా లబ్ధిదారుల ఖాతాలో ఇందిరమ్మ బిల్లులు నగదు జమ అయ్యాయని ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసి నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్లను సైతం పూర్తి చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. మండల వ్యాప్తంగా 21 వేల మంది రైతులకు 17 కోట్ల రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు లక్షల లోపు ఉన్న రుణాన్ని రుణమాఫీ చేసి రైతులకు భరోసాని కల్పించిన విషయం తెలిసిందే ప్రభుత్వం రైతులు యాంత్రికరణ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు సబ్సిడీలో వ్యవసాయ యాంత్రికరణ యంత్రాలను అందిస్తుందని వివరించారు. రానున్న రోజుల్లో పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు అంతర్ జిల్లాల బీటీ రోడ్లు నూతన గ్రామపంచాయతీ బిల్డింగులు అంగన్వాడి బిల్డింగులు సైడ్ కాలువల నిర్మాణం తిరుమలాయపాలెం వైద్య విధాన పరిషత్ ను 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి చేయుట సుబ్లేడ్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం పాలేరు నియోజకవర్గం లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేలకోట్ల రూపాయలు ఖర్చుతో అభివృద్ధి పనులు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే రైతులకు ఇబ్బంది లేకుండా భక్త రామదాసు నీటిని మండు ఏసవిలో సైతం వదిలి చెరువులు నింపారని అతి త్వరలో సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే పాలేరు నియోజకవర్గం మరో కోనసీమగా రూపుదిద్దుకుంటుందని ఆయన వివరించారు.





